నీకు ఇచ్చేవి - డై లాక్సు
పంచుకో - చెలిమి
పెంచకు - కలిమి
పట్టకు - కుస్తీలు
పడకు - సుస్తీలు
వేదాలు - బ్రతుకు గేయాలు
ఖేదాలు - జీవన గాయాలు
అర్ధం చేసుకుంటే -
" అర్ధం" - పరమార్ధం కాదు
భగవద్గీత ....
బ్రతుక్కు ... రాత
పంచ భూతాలు .... తెలుసుకుంటే ...
పంచ భక్ష్య పరమాన్నాలే
నగ్న సత్యాలు ....
నవ్వుల పాలు కాని ... నగ్న శరీరాలు
అమ్మా - నాన్న....
వెన్నా ... జున్ను
ఆవేశం ... రగడ
ఆలొచన ... మీగడ
నిక్కమైన సొగసు
నిజమైన ... మనసు
మంత్రం ... తంత్రం ... యంత్రం -
నాడు మంచికి ..... నేడు కంచికి
నిజం తెలిసేదెలా ... నూటికి
నైజంమారేదెలా ... కోటికి
మాటల తూటాలు
మనం తెచ్చుకునే తంటాలు
నిశ్శబ్దమూ ...వొక శబ్దమే
నిముష నిముషమూ ... వొక అబ్దమే
క్షణాలు ... యుగాలైతే - నరకం
యుగాలు ... క్షణాలైతే - స్నర్గం
నాదైనది ... నాకు ముద్దు
నాది కానిది ... నాకు హద్దు
విజయం ... విలక్షణం
వినయం ... సలక్షణం
తలకు మించిన భారం - తనకు మాలిన ధర్మం
ఓకటి భంగపాటు ... రెండు తొందరపాటు
కణ విచ్ఛేదనం - అణు విస్ఫోటనం
ప్రగతికి విధాయకాలూ కావచ్చు - ప్రకృతికి వినాశకాలూ కావచ్చు
ఆటవిక స్థాయి నుండి - ఆటమిక స్థాయి వరకూ
మనిషి ఎదిగాడు ... మానవతకే ఎదుగు బొదుగు లేదు
రాయైనా - రత్నమైనా యోగికొక్కటే ... జగం మిధ్య
రాయైనా - రత్నమైనా వ్యాపారికొక్కటే ... మాయావిద్య
నేటి పరిపాలన ... పన్నుపోటు - వెన్నుపోటు
నా నోట్లో నీ వేలు ... నీ కంట్లో నా వేలు
దమ్ము - దన్ను - ధైర్యం ...
ఈ మూడూ లేనోడే ... ప్రజాస్వామ్య పౌరుడు
ప్రమాణాలు - వాగ్దానాలు ...
నిలుపుకోనివన్నీ వ్యర్ధాలు ... వ్యంగ్యాలు
జీనితం యొక్క విలువ ... చేజారిన తర్వాతే తెలుస్తుంది
మనస్సు యొక్క వేదన ... మనదాకా వస్తేనే తెలుస్తుంది
No comments:
Post a Comment