Thursday, May 21, 2009

మితిమీరితే ....

 మితిమీరిన  ఖర్చు  ...  పేదరికం పాలు చేస్తుంది.
    మితిమీరిన  పొదుపు  ..  కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన  సంపాదన  ...  మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.
    మితిమీరిన  కర్తవ్యం  ...  అగచాట్ల పాలు చేస్తుంది.
మితిమీరిన  క్రమ శిక్షణ  ...  రక్త సంబధీకులను దూరం చేస్తుంది.
    మితిమీరిన  బాధ్యతలు  ...  అప్పుల పాలు చేస్తుంది.
మితిమీరిన  హాస్యం  ...  నవ్వుల పాలు చేస్తుంది.
     మితిమీరిన  కోపం  ...  శతృవులను వృద్ధి చేస్తుంది.
మితిమీరిన  ఆలోచనలు  ...  జీవితాన్ని దుర్భరం చేస్తుంది.
     మితిమీరిన  వ్యసనాలు  ...  అప మృత్యు పాలు చేస్తుంది.
మితిమీరిన  స్వార్ధం  ...  అందరినీ దూరం చేస్తుంది.
     మితిమీరిన  పోటీ  ...  నష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన  లాభార్జన  ...  వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .
     మితిమీరిన  వస్తూత్పత్తి  ...  నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది.
మితిమీరిన  గర్వాహంకారం  ...  ఆపదలు కొని తెస్తుంది.
     మితిమీరిన అలంకారం  ...  వెగటు పుట్టిస్తుంది.
మితిమీరిన  శృంగారం  ...  వైరాగ్యాన్ని కలిగిస్తుంది.
     మితిమీరిన  కామాంధకారం  ...  జీవచ్చవాన్ని చేస్తుంది.
మితిమీరిన  దారిద్రయం  ..  నేరాల పాలు చేస్తుంది.
     మితిమీరిన  అధికార దాహం  ...  హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.
మితిమీరిన  త్యాగం  ...  కడగండ్ల పాలు చేస్తుంది.
     మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి  ...  భూమిని నిస్సారం చేస్తుంది. 
మితిమీరిన  జనాభా పెరుగుదల  ...  దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
     మితిమీరిన  స్నేహాలు  ...  అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.
మితిమీరిన  గారాబం  ...  చెడు స్నేహాల పాలు చేస్తుంది.
     మితిమీరిన  వేదాంతం  ...  వెటకారం పాలు చేస్తుంది.
మితిమీరిన  ఈర్ష్ర్యాసూయాద్వేషాలు  ..  నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.
     మితిమీరిన   భక్తి  ...  మూర్ఛల పాలు చేస్తుంది.
మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...   నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.
     మితిమీరిన  ఉపవాసాలు  ...  నిస్రాణతకు దారి తీస్తుంది.
మితిమీరిన  ప్రేమ  ...  అనుమానాలకు దారి తీస్తుంది.
     మితిమీరిన  నమ్మకం  ..  ద్రోహానికి దోహదం చేస్తుంది.
మితిమీరిన  విశ్వాసం  ...  లోకువ పాలు చేస్తుంది.
     మితిమీరిన  ఋణం  ...  మరణం పాలు చేస్తుంది.
మితిమీరిన  అభిరుచి  ...  దుబారాకు దారి తీస్తుంది.
     మితిమీరిన  కీర్తి దాహం  ...  ఆదాయాన్ని మింగేస్తుంది.
                              అతి సర్వత్ర వర్జయేత్  ...
                తస్మాత్  ...   జాగ్రత  ...   జాగ్రత  ...  జాగ్రత.
మితాహారం  ...  మిత భాషణం  ...  మితమైన నిద్ర  ... 
 మిత సంసారం  ...  మిత సంపాదన
మనో కాలుష్య రహితంగా  ...  జీవన యానం సాగిస్తే  ...
     పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు   ...   అదే రాచబాట.
     శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి   ...   అదే పూల తోట.
     మూర్తీభవించిన మానవతా విలువలకు   ...   అదే పెట్టని కోట.

అష్టాదశ మానవ కళ్యాణ కారకాలు

సత్యం       ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  వచించడానికి.
ధర్మం       ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ఆచరించడానికి.
ప్రేమ         ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  పొందడానికి.
త్యాగం      ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ధన్యమవ్వడానికి.
దయ         ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  చూపించడానికి.
సేవ           ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  చెయ్యడానికి.
ఆత్మీయత ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  పంచుకోవడానికి.
అదృష్టం     ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  అనుభవించడానికి.
ఓర్పు        ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  సాధించడానికి.
మనస్సు   ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  సంకల్పించడానికి.
బుద్ధి          ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  సంస్కరించడానికి.
శాంతి        ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ఆనందించడానికి.
జ్ఞానం        ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ఆర్జించడానికి.
అహింస     ...  ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  పాటించడానికి.
భక్తి           ...   ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  సమర్పించడానికి.
ప్రకృతి       ...   ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ఆస్వాదించడానికి.
శక్తి            ...   ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  ఛేదించడానికి.
ఆత్మ         ...   ఈ సృష్టిలో దీనికి మించింది లేదు  .....  అన్వేషించడానికి.
                              సకల సద్గుణోపేతుడైన మానవుడు ...
                                                   భగవంతుని  తరువాతి వాడు.
                                                   భగవంతుని  తెలుసుకో దగ్గవాడు.
                                                   భగవంతుని  చేరుకో దగ్గవాడు.
                               కీలక సూత్రం గమనిస్తే   .....
                                                   మానవుడు మహిలో మహనీయుడే.
                                                   నిశ్చయంగా మహాత్ముడే  ... 
                                                                       మహోన్నతుడే.

Wednesday, May 20, 2009

కర్మ యోగి

సౌమ్యం - సౌహార్దం - సౌశీల్యం - సౌజన్యం ........  రంగరించిన సౌరు.
    సేవ - స్నేహం శేముషించిన ...........  సానువు.
మానవత్వం పరిమళించే  ....  మమతానురాగాల సింధువు.
     అచ్చలమించుకైన కానరాని  ......  గంభీర టక్కియము.
నిస్వార్ధ - నిగర్వ - నిరాడంబరతల  ....   నతిశయించు అభీషువు.
     జనహితమె అభీప్సితంగా అభిలషించే  ...  పసిడి మంజూష.
ఓర్పు -సహనములె నిజ సహజాభరణములుగా  ...  భూషించు చికీర్షువు.
     శాంతి - సామరస్యములే నిత్య సత్యాభ్యాసములుగా  ...  
                     అధ్యయించే అహింసా వ్రతం.
మృదు - మధుర భాషణముల నెల్లరి యుల్లముల  ... 
                  చల్లగ చెలగు నవనీత కలశము.
     శ్రద్ధ - భక్తుల గూడిన వినయ - విధేయతల  ... 
                   మెలగు జన్మ సంస్కార జాతిరత్నం.
శతకోటి భారతీయాత్మల  ...  సదా ప్రకాశించే  ......  అఖండ జ్యోతి.
     సర్వదా ప్రభోదించే  ....  అనంత మూర్తి.
భయమెరుగని శౌర్య - ధౌర్య - స్థైర్య  ...  పౌరుషం.
     బ్రిటీషు గుండెల హడలెత్తించిన  ...  పోరాట పటిమ.
అలుపెరుగని అవిశ్రాంత  ...  కఠోర దీక్షా దక్షతం.
     తిరుగు లేని నిర్ణయాలకు  ...  పట్టు విడుపు లేని సాహసం.
అస్పృశ్యతను అదృశ్యం చేసిన  ...  తెగువ తేజం.
     భగవద్గీతయే  -  సాధనాబలంగా  ...  పరిక్రమించిన ప్రజ్ఞాశాలి.
కొల్లాయి తప్పితే చిల్లుగాణీ ... చేబట్టని   ...   పరమహంస.
     పేదలే భగవత్ బంధువులుగా  ...   మానవ సేవయే మాధవసేవగా 
                              తరించే దయార్ద హృదయం.
     అచరణే  ...  అదరణగా  -  అలోచనే  ...  అవేశంగా
జనమే  ...  ప్రభంజనంగా ప్రతిధ్వనించిన  ...  సర్వోదయావాహనం.
     మేధస్సు మెరిసే వజ్రం.   మనస్సు కడిగిన ముత్యం.
బుద్ధి  నిశ్చల నిర్మలం.  వ్యక్తిత్వం  నిర్వికార నిరంజనం.
     మానవత్వమే  అభిమతం.  శీలత్వమే  మతతత్వం.
బోసి నవ్వుల్లో బోలెడు గుణాలు  ...  గుణపాఠాలు.
     నడకలో - నడతలో  ...  ప్రచంఢ శక్తి.
ఛురకత్తుల్లాంటి ఛురకలు.  వ్యంగాస్త్రాలతో హాస్యపు గుళికలు.
     మాటలు  ...  తూటాలు.  క్షణాల విలువలు తెలిసిన లాక్షణికుడు.
వృధా  -  దుబారాల కతీతుడు.  పొదువు వొదువుకున్న బాధ్యతాయుతుడు.
     జనం కోసమే జన్మించిన త్యాగశీలి.
జనం కోసమే శ్రమించిన ధన్య జీవి.
     జనం కోసమే అసువులు బాసిన ...  ప్రేమ పక్షపాతి.
విశ్వానికో వెలుగు కిరణం.  ఆదర్శ ప్రకరణం.
     దారి చూపించిన దేవదూత.  మార్గదర్శ ప్రకర్షము.
కంటే  -  వింటే  -  చరిత్రను సృష్టిస్తే  ...   కోటాను కోట్లకు ఓక్కడే  ...
                     ధృవ తారలా  ...  అమరజీవిలా.
ఓ బాపూజీ ...   ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం  ... 
                     ఓ అశృకణ తర్పణం తప్ప.
     ఓ మహాత్మా  ...  ఏమిచ్చి నీ పవిత్రాత్మకు శాంతి చేకూర్చగలం  ... 
                            నీ బాటలో నడవటం తప్ప.
ఓ జాతిపితా  ...  ఏమిచ్చి నీక్షమను పొందగలం  ...  ప్రేమను పంచడం తప్ప.
     ఓ భారత భాగ్య విధాతా  ...  ఏమిచ్చి నీ కరుణకు పాత్రులవ్వగలం  ...
                        చిత్త పుష్పార్పణం తప్ప.
ఓ విశ్వ హృదయా  ...  ఏమిచ్చి నీ త్యాగానికి బదులివ్వగలం  ... 
                       నీ చరిత్రను చాటిచెప్పడం తప్ప.
     అఖండ భారతావని స్వేచ్ఛా స్వాతంత్య సమర నినాద
                  సత్యగ్రహాయుధ మౌన సేనానీ  ....
     కర్మ సాక్షికి నిలువెత్తు బింబంగా   ...   ప్రతిబింబించిన కర్మయోగీ....
నీకివే  ...  మా మానస లాలస నీరాజనాలు.
     నీకివే  ...  మా శతకోటి వందన మందారాలు.

     


     

Monday, May 11, 2009

చిఱు గుళికలు

వాడు చెప్పేవి - డైలాగ్సు
నీకు ఇచ్చేవి - డై లాక్సు
     
     పంచుకో - చెలిమి
     పెంచకు - కలిమి

పట్టకు - కుస్తీలు
పడకు - సుస్తీలు

     వేదాలు - బ్రతుకు గేయాలు
     ఖేదాలు - జీవన గాయాలు

అర్ధం చేసుకుంటే  -  
" అర్ధం" - పరమార్ధం కాదు

     భగవద్గీత ....
     బ్రతుక్కు ... రాత

పంచ భూతాలు  ....  తెలుసుకుంటే  ...
పంచ భక్ష్య పరమాన్నాలే
     
     నగ్న సత్యాలు ....
     నవ్వుల పాలు కాని ... నగ్న శరీరాలు

అమ్మా  -  నాన్న....
వెన్నా ... జున్ను

      ఆవేశం  ...  రగడ
      ఆలొచన ... మీగడ

నిక్కమైన సొగసు 
నిజమైన  ... మనసు

     మంత్రం ... తంత్రం ...  యంత్రం -
     నాడు మంచికి  ..... నేడు కంచికి

నిజం తెలిసేదెలా  ...  నూటికి
నైజంమారేదెలా  ...   కోటికి

     మాటల తూటాలు
     మనం తెచ్చుకునే తంటాలు

నిశ్శబ్దమూ  ...వొక శబ్దమే
నిముష నిముషమూ ...  వొక అబ్దమే

     క్షణాలు  ...  యుగాలైతే -  నరకం
     యుగాలు  ...  క్షణాలైతే  - స్నర్గం

నాదైనది  ...  నాకు ముద్దు
నాది కానిది  ...  నాకు హద్దు

     విజయం  ...  విలక్షణం
     వినయం  ...  సలక్షణం

తలకు మించిన భారం   -   తనకు మాలిన ధర్మం
ఓకటి భంగపాటు  ...          రెండు తొందరపాటు

     కణ విచ్ఛేదనం   -   అణు విస్ఫోటనం
     ప్రగతికి విధాయకాలూ కావచ్చు - ప్రకృతికి వినాశకాలూ కావచ్చు

ఆటవిక స్థాయి నుండి  -  ఆటమిక స్థాయి వరకూ
మనిషి ఎదిగాడు  ...  మానవతకే ఎదుగు బొదుగు లేదు

     రాయైనా - రత్నమైనా యోగికొక్కటే  ...  జగం మిధ్య
     రాయైనా - రత్నమైనా వ్యాపారికొక్కటే  ...   మాయావిద్య

నేటి పరిపాలన  ...  పన్నుపోటు - వెన్నుపోటు
నా నోట్లో నీ వేలు   ...   నీ కంట్లో నా వేలు

దమ్ము - దన్ను - ధైర్యం   ...
ఈ మూడూ లేనోడే  ...   ప్రజాస్వామ్య పౌరుడు

     ప్రమాణాలు - వాగ్దానాలు ...
     నిలుపుకోనివన్నీ వ్యర్ధాలు ... వ్యంగ్యాలు

జీనితం యొక్క విలువ  ...  చేజారిన తర్వాతే తెలుస్తుంది
మనస్సు యొక్క వేదన  ...  మనదాకా వస్తేనే తెలుస్తుంది