Wednesday, January 28, 2009

మాతృ భాషా దినోత్సవం - 21-02-2009

జన్మనిచ్చిన మాతృమూర్తి - జన్మించిన మాతృదేశం - జన్మను ధన్యం చేసిన మాతృభాష -ఈ త్రిమాతృకలను 
 ప్రేమించని వాడు - సేవించని వాడు - పూజించని వాడు  ధరణిలో వ్యర్ధం.
మన భాష కడు రమ్యమైన తెలుగు భాష.
తేనె కన్నా - జున్ను కన్నా ... మధురమైన భాష.
వెన్న కన్నా - వెన్నెల కన్నా ... మృదువైన భాష.
పాల కన్నా - మురిపాల కన్నా ... కమ్మనైన భాష.
మల్లెల కన్నా - ముత్యాల కన్నా ...అందమైన భాష.
మంచు కన్నా - మంచి గంధం కన్నా ... చల్లనైన భాష.
ఏ విధంగా నైనా ... ఓదిగి పోయే - పొదిగి పోయే - ఎదిగి పోయే భాష ... మన తెలుగు భాష.
మత్తుగా - గమ్మత్తుగా - మైమరపించే - మనసు దోచే భాష ... మన తెలుగు భాష.
తరతరాల భాగ్య పరంపరగా - కుసుమాల కన్నా సుకుమారంగా - 
ఆంధృల అదృష్ట వరంగా తీర్చి దిద్దిన భాష  ...  మన తెలుగు భాష.
దేశ భాషలందు తెలుగు లెస్సగా  - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా ...
ప్రాభవాన్ని - ప్రౌఢత్వాన్ని సంతరించుకున్న మన తెలుగు భాష ...
భావ సౌందర్యంలో - భాషా సౌందర్యంలో - అర్ధ సౌందర్యంలో - శబ్ద సౌందర్యంలో
సాటి లేని - ధీటు రాని - మేటి భాషగా
విద్వత్తును ...విద్యుత్తులా ప్రసరింప జేసే భాషగా
రమణీయ - కమనీయ - రాగరంజితంగా విరాజిల్లే ... మన తెలుగు భాషకు
నిండుగా - మెండుగా - దండిగా వెలుగులు నింపుదాం.
తెలుగు భాషను సంస్కరించిన కవి - పండిత కోటికి -
కృతజ్ఢతా నీరాజనాల నర్పిద్దాం.
తెలుగు వాడిని - తెలుగు వేడిని - తెలుగు వాణిని - తెలుగు బాణిని విజయగర్నంతో చాటుదాం.
తెలుగు భాషను పటిష్ట పరుద్దాం.  తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేద్దాం.
                         జై తెలుగు తల్లి .. జయహో .. జయహో.